News August 9, 2025
‘WAR-2’లో షారుఖ్, సల్మాన్?

‘WAR-2’ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, శార్వరి కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ‘స్పై యూనివర్స్’లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలో షారుఖ్, సల్మాన్ హీరోలుగా సినిమాలు నిర్మించింది. ‘WAR2’ కూడా అదే యూనివర్స్ నుంచి వస్తుండగా.. ఆలియా, శార్వరిలతో ‘ఆల్ఫా’ అనే మూవీ తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌లో వీరందరిని ఒకే మూవీలో చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
Similar News
News August 9, 2025
రాఖీ కడుతున్నారా.. ఎన్ని ముళ్లు వేయాలంటే?

ఇవాళ రాఖీ పండగ. ఆడబిడ్డలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాఖీ కట్టేటప్పుడు తప్పనిసరిగా 3 ముళ్లు వేయాలని పండితులు చెబుతున్నారు. అది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక అంటున్నారు. మొదటి ముడి సోదరుడి దీర్ఘాయుష్షు, భద్రత, శ్రేయస్సును.. రెండో ముడి సోదరసోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమ, నమ్మకం, గౌరవాన్ని.. మూడో ముడి సోదరుడు జీవితంలో ఎల్లప్పుడూ సన్మార్గంలోనే నడవాలని సూచిస్తుంది.
News August 9, 2025
రాష్ట్రంలో రోజూ ఎంతమంది మద్యం తాగుతున్నారంటే?

AP: రాష్ట్ర జనాభాలో 31.2 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 0.2 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉందని వెల్లడించింది. రోజూ 50 లక్షల మంది మందు తాగుతున్నారు. కోటిమందికిపైగా వారానికి ఒకసారి మద్యం సేవిస్తున్నారు. ఒక్కొక్కరు సగటున నెలకు 11 క్వార్టర్లు తాగుతున్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 17.2% మహిళలు మద్యం తాగుతున్నట్లు సర్వేలో తేలింది.
News August 9, 2025
ఆ దేశంలో పెళ్లికి ఎవరైనా వెళ్లొచ్చు..!

సాధారణంగా పెళ్లిళ్లకు బంధువులు, స్నేహితులు వెళ్తుంటారు. కానీ ఫ్రాన్స్‌లో మాత్రం ఎవరి పెళ్లికి ఎవరైనా వెళ్లొచ్చు. ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించి టికెట్ కొని పెళ్లి చూడొచ్చు. పెళ్లిలో డ్రెస్ కోడ్ పాటించాలి. విందు ఆరగించవచ్చు. కొత్త పరిచయాలు చేసుకోవచ్చు. పెళ్లి మనదే అనేలా ఎంజాయ్ చేయొచ్చు. ‘ఇన్విటిన్’ సంస్థ ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఇండియాలోనూ ‘జాయిన్ మై వెడ్డింగ్’ అనే పేరుతో ఈ ట్రెండ్ వచ్చేసింది.