News September 25, 2024
షాహిన్ అఫ్రీదికి గాయం.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరం?

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీదికి గాయమైంది. దీంతో అతడు టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యే ఛాన్సుంది. ఛాంపియన్స్ వన్డేకప్‌లో డాల్ఫిన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. మోకాలికి బంతి బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడి మైదానాన్ని వీడారు. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. OCT 7 నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది.
Similar News
News January 8, 2026
Official: ‘జన నాయగన్’ విడుదల వాయిదా

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
News January 8, 2026
ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.
News January 8, 2026
ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా.. నోబెల్ ఇవ్వరా: ట్రంప్

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నార్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా. నాటో సభ్య దేశమైన నార్వే నన్ను నోబెల్‌కు ఎంపిక చేయకుండా ఫూలిష్‌గా వ్యవహరించింది. అయినా నోబెల్ నాకు మ్యాటర్ కాదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను. అది చాలు’ అని ట్వీట్ చేశారు. అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని.. రష్యా, చైనాలు దాన్ని లెక్కచేయవని స్పష్టం చేశారు.


