News July 24, 2024

అరుదైన ఘనత సాధించిన షారుఖ్ ఖాన్

image

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అరుదైన ఘనత సాధించారు. పారిస్‌లోని గ్రేవిన్ మ్యూజియం ఆయన పేరు, చిత్రంతో ప్రత్యేక బంగారు నాణేన్ని విడుదల చేసింది. బాలీవుడ్ నుంచి ఈ ఘనత పొందిన ఏకైక నటుడిగా షారుక్ నిలిచారు. ఇప్పటికే SRK మైనపు విగ్రహాలు గ్రేవిన్ మ్యూజియంతో సహా ప్రపంచంలో 14 చోట్ల ఏర్పాటు చేశారు. గత 30 ఏళ్లుగా అద్భుతమైన చిత్రాల్లో నటించిన కింగ్ ఖాన్ అంతర్జాతీయంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Similar News

News December 3, 2025

‘అఖండ-3’ ఉందని హింట్ ఇచ్చిన తమన్?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈనెల 5న విడుదలవనుంది. ఈ సందర్భంగా రికార్డింగ్ స్టూడియోలో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఫైనల్ ఔట్‌పుట్‌ను వీక్షించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఎండ్ కార్డ్ ఫొటోను Xలో పంచుకున్నారు. అందులో ‘జై అఖండ’ అని ఉండటంతో ఇది పార్ట్-3 టైటిల్ అనే చర్చ మొదలైంది. ‘అఖండ-2’ ముగింపులో సీక్వెల్ కొనసాగింపుపై డైరెక్టర్ లీడ్ ఇస్తారని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News December 3, 2025

రాజ్‌నాథ్ ఆరోపణలన్నీ నిరాధారాలే: కాంగ్రెస్

image

మాజీ ప్రధాని నెహ్రూపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ నిరాధార ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చెప్పారు. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి ప్రజాధనం వినియోగించడానికి నిరాకరించిన నెహ్రూ, బాబ్రీ నిర్మాణానికి పన్నుల ద్వారా వచ్చిన నిధులు కేటాయించాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. మాస్క్‌లు, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలకు ప్రజాధనాన్ని వినియోగించకూడదని నెహ్రూ భావించేవారని ఠాగూర్ తెలిపారు.

News December 3, 2025

ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​లో నిర్వహించనున్న రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేశారు.