News November 5, 2024
గంభీర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్

తన పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రిప్లై ఇచ్చారు. ‘ఈయనే 25 ఏళ్ల వ్యక్తి. ప్రతి ఏటా మీ శక్తి, తేజస్సు మరింత పెరుగుతూ వస్తోంది. మీరు ఎప్పటికీ ప్రేమను పంచుతూ ఉండండి’ అని గంభీర్ ట్వీట్ చేశారు. దీనికి షారుఖ్ స్పందిస్తూ ‘నాకు 25 ఏళ్లా? నేనింకా చిన్నవాడిని అనుకున్నానే. హ హ. స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు థాంక్స్. మీరెప్పటికీ నా కెప్టెనే’ అని రిప్లై ఇచ్చారు.
Similar News
News December 8, 2025
చలితో ఉమ్మడి వరంగల్ గజ గజ!

వరంగల్ నగరంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయంలో 12 డిగ్రీలు ఉంటోంది. వచ్చే మూడు రోజుల్లో కనీస ఉష్ణోగ్రతలు 10-11 డిగ్రీల వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ములుగులో 12, భూపాలపల్లిలో 12.1, జనగామలో 12.4, మహబూబాబాద్‌లో 13, వరంగల్ జిల్లాలో 12 డిగ్రీలకు చేరింది. గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతో జనం వణికిపోతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.


