News August 1, 2024
IPL-BCCI మీటింగ్‌లో షారుఖ్ vs నెస్వాడియా?

నిన్న ముంబైలో జరిగిన IPL-BCCI మీటింగ్‌లో మెగా వేలం, రిటెన్షన్‌పై వాడీ వేడీ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. KKR ఓనర్ షారుఖ్ ఖాన్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా PBKS ఓనర్ నెస్ వాడియా ఖండించారని, మెగా వేలం నిర్వహించాలని కోరినట్లు టాక్. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. మెగా వేలం నిర్వహణకు అత్యధిక ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరచలేదట.
Similar News
News December 6, 2025
ప్చ్.. ప్రసిద్ధ్ కృష్ణ మళ్లీ..

రెండో వన్డేలో ధారాళంగా పరుగులిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను నేటి మూడో వన్డేకూ ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తొలి వన్డేలో అతడు 8.2 ఓవర్లకు 85రన్స్ ఇచ్చాడు. నేటి మ్యాచులోనూ 2 ఓవర్లకే 27 రన్స్ సమర్పించుకున్నాడు. అతడు వేసిన 11వ ఓవర్లో డీకాక్ 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. దీంతో షమీ లాంటి నాణ్యమైన బౌలర్లను వదిలేసి ఇలాంటి వారినెందుకు ఆడిస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News December 6, 2025
రేపు రాత్రిలోపు రీఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం ఆదేశం

టికెట్లు రద్దయిన ప్రయాణికులందరికీ ఆలస్యం లేకుండా రీఫండ్ చేయాలని ఇండిగోను కేంద్ర విమానయాన సంస్థ ఆదేశించింది. అందుకు రేపు రాత్రి 8 గంటల వరకు గడువు విధించింది. ప్రయాణికులకు ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రాసెస్‌లో అలసత్వం వహిస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు ఇవాళ కూడా ఇండిగోకు చెందిన వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.
News December 6, 2025
సైబర్ మోసాల నుంచి రక్షణకు గూగుల్ కొత్త ఫీచర్

సైబర్ మోసాల బారిన పడి రోజూ అనేకమంది ₹లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎక్కువగా మొబైల్ యూజర్లు నష్టపోతున్నారు. దీనినుంచి రక్షణకు GOOGLE ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్’ అనే ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీల యాప్‌లు తెరిచినప్పుడు, సేవ్ చేయని నంబర్ల కాల్స్ సమయంలో పనిచేస్తుంది. మోసపూరితమైతే స్క్రీన్‌పై హెచ్చరిస్తుంది. దీంతో కాల్ కట్ చేసి మోసం నుంచి బయటపడే అవకాశముంది.


