News March 19, 2024

షారుఖ్ నాకు చెప్పిన సందేశం అదే: గంభీర్

image

గౌతమ్ గంభీర్ ఈ సీజన్‌ నుంచి KKR మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. టీమ్‌లో తిరిగి చేరాక జట్టు యజమాని షారుఖ్‌ తనతో అన్న మాటల్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘2011లో ఆటగాడిగా జట్టులో చేరినప్పుడు చెప్పిన విషయమే ఇప్పుడు కూడా షారుఖ్ నాకు చెప్పారు. ఇది నీ జట్టు. పాల ముంచినా, నీట ముంచినా నీదే అన్నారు. ఇక్కడ ఎన్నాళ్లు ఉంటానో తెలీదు కానీ.. వెళ్లేలోపు మరింత మెరుగుపరిచే వెళ్తాను’ అని స్పష్టం చేశారు.

Similar News

News August 28, 2025

ఇథనాల్ పెట్రోల్‌తో గడ్కరీ కుమారుడి కంపెనీకి భారీ లాభాలు: కాంగ్రెస్

image

ఇథనాల్ పెట్రోల్‌తో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ కంపెనీ భారీగా లబ్ధి పొందుతోందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. 2024 జూన్ త్రైమాసికానికి ఆయనకు చెందిన CIAN ఆగ్రో ఆదాయం కేవలం రూ.17 కోట్లు ఉంటే ఏడాది కాలంలోనే అది రూ.511 కోట్లకు చేరిందని తెలిపింది. షేర్ విలువ రూ.43 నుంచి రూ.668కి ఎగబాకిందని పేర్కొంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు నాశనం అవుతుంటే నిఖిల్ వ్యాపారం విస్తరిస్తోందని తెలిపింది.

News August 28, 2025

ఇవాళే లాస్ట్.. IBPSలో 10,270 ఉద్యోగాలు

image

IBPS క్లర్క్ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. దేశంలోని పలు బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉండగా ఏపీలో 367, టీజీలో 261 ఖాళీలు ఉన్నాయి. కనీసం డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా సెలక్ట్ చేస్తారు. ibps.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News August 28, 2025

HYDకి బీచ్ రాబోతోంది!

image

హైదరాబాద్‌లో త్వరలోనే బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలుకానుంది. బీచ్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నారు. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి కానుంది.