News November 25, 2024
‘కలుషిత ఆహారం’ బాధితురాలు శైలజ మృతి
TG: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ(16) మృతి చెందింది. సెప్టెంబర్ 30న కుమ్రంభీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలోనే శైలజను చికిత్స కోసం నిమ్స్‌లో చేర్చారు. ఇటీవల ఆమెను రాష్ట్ర మంత్రులు, BRS నేతలు పరామర్శించారు. అయితే పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే శైలజ తనువు చాలించింది.
Similar News
News November 25, 2024
బాలినేని సంతకంతోనే సెకీ ఒప్పందం: చెవిరెడ్డి
AP: అప్పట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకంతోనే సెకీతో ఒప్పందం కుదిరిందని ycp నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆయన దీనిపైనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ‘జగన్ గురించి బాలినేని వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. పార్టీలో ఉన్నప్పుడు బాలినేని స్పెషల్ ఫ్లైట్స్‌లో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇచ్చి గౌరవించారు. కానీ జగన్నే ఆయన బ్లాక్ మెయిల్ చేశారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News November 25, 2024
స్మిత్ మరోసారి అన్‌సోల్డ్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ IPL వేలంలో మరోసారి అన్‌సోల్డ్‌గా మిగిలారు. అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. గత వేలంలోనూ స్మిత్‌ను ఎవరూ కొనలేదు. ఇక మిచెల్ శాంట్నర్‌ను ముంబై రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. సికిందర్ రజా, నిస్సాంక, అట్కిన్సన్, జోసెఫ్, రిచర్డ్ గ్లీసన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News November 25, 2024
MI కీలక ఆటగాళ్లను దక్కించుకున్న RCB
ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు టిమ్ డేవిడ్(రూ.5.25 కోట్లు), రొమారియో షెఫర్డ్ (రూ.1.50 కోట్లు)ను బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు MI విల్ జాక్స్‌ను కొన్న సమయంలో ఆర్సీబీ RTM ఉపయోగించలేదు. ఇందుకు ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ ఆర్సీబీ సీఈఓను టేబుల్ దగ్గరికి వెళ్లి మరీ హగ్ చేసుకున్నారు.