News March 20, 2024

SRH కెప్టెన్సీ మార్పుతో షాకయ్యా: అశ్విన్

image

SA20లో సన్‌రైజర్స్ జట్టును రెండుసార్లు విజేతగా నిలిపారు కెప్టెన్ మార్క్రమ్. అలాంటి ఆటగాడిని ఐపీఎల్‌లో SRH కెప్టెన్‌గా తప్పించడం షాక్ గురిచేసిందని భారత బౌలర్ అశ్విన్ అన్నారు. ‘మళ్లీ మార్క్రమ్‌నే కొనసాగిస్తారని నేను భావించా. అలాంటిది వాళ్లు కెప్టెన్‌ను మార్చడం నాకు షాకింగ్‌గా అనిపించింది. కమిన్స్‌ను కెప్టెన్‌ చేయడం కచ్చితంగా సన్‌రైజర్స్‌ తుది జట్టు కూర్పును ఇబ్బంది పెడుతుంది’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 1, 2024

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లకు షాక్!

image

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై రాబడి తగ్గిపోవచ్చు. OCT 1 నుంచి మారిన పాలసీ సరెండర్ రూల్సే ఇందుకు కారణం. ఇప్పట్నుంచి ఒక ప్రీమియం చెల్లించినా మొదటి ఏడాది నుంచే గ్యారంటీగా సరెండర్ వాల్యూను పొందొచ్చు. దీంతో ఎక్కువ కాలం హోల్డ్ చేసే పాలసీలపై రిటర్న్స్ 30-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గొచ్చని విశ్లేషకులు అంటున్నారు. బోనస్‌లోనూ కోత పడనుంది. నాన్ పార్టిసిపేటరీ పాలసీలపై మార్పు ప్రభావం వెంటనే ఉండనుంది.

News October 1, 2024

4 నెలల వయసులో చిన్నారికి పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు

image

తన బాల్య వివాహానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఓ యువతి విజయం సాధించారు. 2004లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 4 నెలల చిన్నారి అనితకు పేరెంట్స్ పెళ్లి చేశారు. ఇప్పుడు కాపురానికి రావాలంటూ అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె 20 ఏళ్ల వయసులో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా, ఆ పెళ్లిని రద్దు చేసి, కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్తమామలను ఆదేశించింది. బాల్య వివాహాలు దుర్మార్గం, నేరమని వ్యాఖ్యానించింది.

News October 1, 2024

మూసీ శుద్ధీకరణను అడ్డుకోవడం ఆ జిల్లాలకు మరణశాసనమే: కోమటిరెడ్డి

image

TG: మూసీ నది శుద్ధీకరణ అడ్డుకోవడమంటే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మరణశాసనం రాయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూసీ విష రసాయనాలతో ఇప్పటికే ఇక్కడ పండే పంటలు, కాయగూరలను ఎవరూ కొనని పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుద్ధీకరణ కోసం ముందడుగు వేస్తుంటే రోజుకో కుట్రతో BRS రాజకీయం చేస్తుండటం అత్యంత దారుణం అని విమర్శించారు.