News November 25, 2024

$99,800 వద్ద బిట్‌కాయిన్‌లో SHAKEOUT

image

క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్‌కాయిన్ దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం $98000 వద్ద కొనసాగుతోంది. అంటే భారత కరెన్సీలో రూ.82.60 లక్షలు అన్నమాట. మొన్న $99,800 వద్దకు చేరుకున్న BTC లక్ష డాలర్లను తాకడం లాంఛనమే అనుకున్నారు. రెసిస్టెన్సీ ఎదురవ్వడం, ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో $95,600కు దిగొచ్చింది. ఇన్వెస్టర్లు అక్యూములేట్ చేసుకోవడంతో మళ్లీ పుంజుకుంది. ఏదేమైనా లక్షల డాలర్లను తాకడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

Similar News

News November 25, 2024

భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం తీర్పు

image

TG: జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.

News November 25, 2024

DCని కేఎల్, అక్షర్ లీడ్ చేస్తారు: పార్థ్ జిందాల్

image

వచ్చే IPL సీజన్‌లో DCని కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లీడ్ చేస్తారని కోఓనర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. ‘మాకు యంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. టాప్ ఆర్డర్‌లో నిలకడ కోసం KLను తీసుకున్నాం. అతను ప్రతి సీజన్‌లో 400+ పరుగులు చేశారు. మా హోమ్ గ్రౌండ్(కోట్లా) అతనికి సరిగ్గా సరిపోతుంది. యంగ్ టీమ్‌ను KL, అక్షర్ గైడ్ చేస్తారు’ అని చెప్పారు. స్టార్క్, మెక్‌గుర్క్, బ్రూక్, అశుతోష్, రిజ్వీని వేలంలో DC దక్కించుకుంది.

News November 25, 2024

బిహార్ విఫల రాష్ట్రం.. చెత్తలో కూరుకుపోయింది: ప్రశాంత్ కిశోర్

image

బిహార్‌లో 4 స్థానాలకు జరిగిన బైఎలక్షన్‌లో ఘోర ఓటమి తర్వాత జన సురాజ్ లీడర్ ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. USలోని బిహారీలతో వర్చువల్‌గా మాట్లాడుతూ ‘బిహార్ ఒక విఫల రాష్ట్రం. అది చెత్తలో కూరుకుపోయింది. సుడాన్‌లో 20ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ప్రజలు పిల్లల చదువుల గురించి పట్టించుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’ అని చెప్పారు.