News May 26, 2024
చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో 14,000 పరుగులతోపాటు 700 వికెట్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించారు. యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. కాగా ఇప్పటివరకు 48 మంది బ్యాటర్లు 14,000 పరుగులు చేశారు. 17 మంది బౌలర్లు 700 వికెట్లు పడగొట్టారు. కానీ ఈ రెండింటిని సాధించిన ఒకే ఒక్క ప్లేయర్‌గా షకీబ్ నిలిచారు.
Similar News
News December 31, 2024
‘మ్యాడ్’ దర్శకుడితో మాస్ మహరాజా సినిమా?
‘మ్యాడ్’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ సాధించి, దానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందిస్తున్నారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఇటీవల ఆయన మాస్ మహరాజా రవితేజకు ఓ కథ వినిపించారని సినీ వర్గాలు వెల్లడించాయి. రవితేజ ఈ స్క్రిప్ట్‌ను ఓకే చేస్తే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News December 31, 2024
విస్కీ ఛాలెంజ్.. ఇన్ఫ్లూయెన్సర్ దుర్మరణం
థాయ్‌లాండ్‌లో తనకర్న్ కాంథీ(21) అనే ఇన్ఫ్లూయెన్సర్ మద్యం ఛాలెంజ్‌లో విఫలమై దుర్మరణం పాలయ్యాడు. రూ.75,000 ఇస్తే ఒక్కోటి 350ML క్వాంటిటీగల మూడు బాటిళ్ల విస్కీని తాగేస్తానంటూ పందెం కాశాడు. అప్పటికే ఫుల్లుగా తాగిన అతను ఛాలెంజ్‌లో భాగంగా మరో 2 బాటిళ్లను 20 నిమిషాల్లో తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ పందెం కాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
News December 30, 2024
మీరు క్షేమంగా ఉండటమే నాకిచ్చే గొప్ప బహుమతి: యశ్
JAN 8న తన పుట్టినరోజు సందర్భంగా హీరో యశ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ‘ఇన్నాళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమ అసాధారణం. బర్త్‌డే వేడుకల విషయంలో ప్రేమ వ్యక్తీకరణను మార్చుకోవాలి. మీరు సురక్షితంగా, క్షేమంగా ఉండటమే నాకిచ్చే గొప్ప బహుమతి. మీరు 2025లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది తన ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తూ ముగ్గురు ఫ్యాన్స్ చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన రాసుకొచ్చారు.