News September 26, 2024

షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం?

image

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్‌కు స్వస్తి పలికినట్లు సమాచారం. ఈ ఏడాది చివరన మిర్‌పుర్‌లో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు తన చివరి మ్యాచ్ అని ఆయన ఇప్పటికే ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా షకీబ్ ఇప్పటివరకు బంగ్లా తరఫున 70 టెస్టులాడారు. 4,600 పరుగులతోపాటు 242 వికెట్లు తీశారు.

Similar News

News December 5, 2025

ఇండిగో ఎఫెక్ట్.. డీజీసీఏ కీలక నిర్ణయం

image

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధుల విషయంలో విధించిన <<18475795>>ఆంక్షలను <<>>ఎత్తివేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి సెలవుల నిబంధనను తొలగించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. పలు విమానయాన సంస్థల వినతి మేరకు చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో ఫ్లైట్ల సర్వీసులు తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయి.

News December 5, 2025

‘హిల్ట్’పై హైకోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

image

TG: <<18450502>>హిల్ట్<<>> పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

News December 5, 2025

కూరగాయల పంటల్లో వైరస్ తెగుళ్లు ఎలా వ్యాపిస్తాయి?

image

కూరగాయల పంటలకు రసం పీల్చే పురుగుల ముప్పు ఎక్కువ. ఇవి వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. ఈ తెగుళ్లతో 25-75% వరకు పంట నష్టం జరుగుతుంది. వైరస్ సోకిన మొక్కలను రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే, వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీర భాగాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల రసం పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల నుంచి వైరస్‌లు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తాయి.