News August 28, 2024
షకీబ్ ఆల్టైమ్ ఫేవరెట్ వన్డే టీమ్.. రోహిత్కు నో ఛాన్స్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్టైమ్ ఫేవరెట్ వన్డే జట్టును ప్రకటించారు. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు కల్పించలేదు. ధోనీ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లకు చోటు కల్పించడం విశేషం. జట్టు: సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, జాక్ కల్లిస్, ధోనీ, షకీబ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్గ్రాత్.
Similar News
News December 24, 2025
రాళ్లు పెరుగుతాయా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

భూమి పుట్టుక నుంచి నేటి వరకు జరిగిన మార్పులకు రాళ్లు సజీవ సాక్ష్యాలని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లు ప్రధానంగా 3 రకాలు. అగ్నిపర్వత లావాతో ఏర్పడే ఇగ్నియస్, ఇసుక-మట్టి పొరలతో తయారయ్యే సెడిమెంటరీ, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందే మెటామార్ఫిక్. రాళ్లు పెరగవని, వాతావరణ మార్పుల వల్ల అరిగిపోతాయన్నారు. ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ వల్ల తెల్లగా, కార్బన్ ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి.
News December 24, 2025
నల్ల వెల్లుల్లి గురించి తెలుసా.. బోలెడు ప్రయోజనాలు

వెల్లుల్లి అంటే తెల్లటి రెబ్బలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నల్ల వెల్లుల్లి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తెల్ల వెల్లుల్లిని ఫర్మంటేషన్ ప్రక్రియ ద్వారా నల్లగా తయారు చేస్తారు. ఇది ఘాటు వాసన లేకుండా కొంచెం తీపిగా ఉంటుంది. నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు ఒకటి రెండు రెబ్బలు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News December 24, 2025
కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల(గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా యానిమల్(రూ.917 కోట్లు)ను బీట్ చేసి 9వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి రికార్డులు బ్రేకవడం గ్యారంటీ.


