News March 26, 2024
వణుకుతున్న పుతిన్ ప్రత్యర్థులు!

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మరణం తర్వాత దేశంలో పుతిన్ ప్రత్యర్థులందరూ వణికిపోతున్నారని అక్కడి ‘ఫ్రీ రష్యా ఫౌండేషన్’ సలహాదారు ఇవ్జీనియా కారా-ముర్జా వెల్లడించారు. అధ్యక్షుడి తీరును తన భర్త వ్లాదిమిర్ సహా పలువురు ఎండగట్టారని, దీంతో కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించిందని తెలిపారు. గతంలో తన భర్తను చంపేందుకు చూసినవారే ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 3, 2026
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ: కేటీఆర్

TG: నిరుద్యోగుల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగలడం ఖాయమని KTR హెచ్చరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా సీఎం రేవంత్ ముఖం చాటేశారని ఫైరయ్యారు. అలాగే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తానని చెప్పిన మాట అటకెక్కిందని దుయ్యబట్టారు. 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని ప్రజలు తెలుసుకున్నారన్నారు.
News February 3, 2026
ఈనెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు!

TG: CM రేవంత్ సోమవారం రాత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బడ్జెట్ సన్నాహక సమీక్షలు, శాఖల వారీ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను పరిశీలించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చే నిధులపై సమీక్షించారు. కాగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల చివరి వారంలో నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.
News February 3, 2026
ఇంటర్వ్యూతో స్పైస్ బోర్డ్‌లో ఉద్యోగాలు

<


