News March 4, 2025
గతంలో విరాట్ కోహ్లీపైనా షామా సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ గతంలో విరాట్‌పైనా నోరు పారేసుకున్నారు. తనకు విదేశీ క్రికెటర్లు ఇష్టమన్న ఓ అభిమానిపై విరాట్ 2018లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోహ్లీ బ్రిటిష్ వారు కనిపెట్టిన ఆట ఆడుతున్నారు. విదేశాల బ్రాండ్స్‌కు రాయబారి. ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. గిబ్స్ ఆయన అభిమాన క్రికెటర్. కానీ విదేశీ ఆటగాళ్లను ఇష్టపడేవారిని దేశం వదిలిపొమ్మంటారు’ అని షామా అప్పట్లో ట్వీట్ చేశారు.
Similar News
News March 7, 2026
ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి వివేక్

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఇన్చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. మెదక్‌లో జరిగిన ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది నాటికి 30 శాతం సాగు పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని, ఈ పంట వల్ల కలిగే లాభాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లు, వ్యవసాయ అధికారులకు సూచించారు.
News March 7, 2026
గుంటూరు: ఈ నెల 13 నుంచి HPV వ్యాక్సినేషన్

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్‌ను మార్చి 13 నుంచి ప్రారంభించనున్నట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో 14,167 మంది అర్హులను గుర్తించామని, PHCలు, CHCలు, GGHలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. 90 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో బాలికలందరికీ టీకా వేయించాలని ఆమె కోరారు.
News March 7, 2026
TODAY HEDALINES

*13 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్ చేస్తాం: CBN
*ఉగాది తర్వాత లోకేశ్ సీఎం: పేర్ని నాని
*ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్
*ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: CM రేవంత్
*ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్
*యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయం చేస్తోందన్న అమెరికా
*యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల
*TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ: హైకోర్టు


