News September 10, 2025

బవుమాకు మళ్లీ అవమానం!

image

SA టీ20 లీగ్‌ వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. 2 లక్షల ర్యాండ్‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో బవుమా అన్‌సోల్డ్‌గా మిగిలారు. గత సీజన్‌లోనూ ఆయన అమ్ముడుపోలేదు. కాగా టీ20 ఫార్మాట్‌లో బవుమా 36 మ్యాచుల్లో 118 స్ట్రైక్ రేట్‌తో 670 పరుగులు చేశారు. గతంలో దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు నాయకత్వం కూడా వహించారు.

Similar News

News March 4, 2026

ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

image

చంద్రగ్రహణంతో ఈసారి హోలీ పండుగ ఎప్పుడనే గందరగోళం ఏర్పడింది. కొందరు నిన్నే రంగులు చల్లుకోగా.. AP, TG ప్రభుత్వాలూ స్కూళ్లకు మంగళవారమే సెలవు ఇచ్చాయి. అయితే గ్రహణం ఉండటంతో ఇవాళ(బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు తెలిపారు. కానీ స్కూళ్లకు నిన్నే పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో ఇవాళ సెలవు లేదు. పిల్లలు బడికి వెళ్లాల్సిందే. అటు చాలావరకు ప్రైవేటు కార్యాలయాలకు ఇవాళ సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీకూ ఉందా?

News March 4, 2026

దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

image

దేశంలో వైట్ కాలర్ జాబ్స్‌ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.

News March 4, 2026

ఎండలు బాబోయ్..! ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్

image

దేశంలో ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు TGలో వచ్చే రెండు,మూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలను తాకుతుందని అంచనా వేసింది.