News September 15, 2024
ధోనీకి మహా సిగ్గు: ఆకాశ్ చోప్రా

ఎంఎస్ ధోనీ టీమ్ ఇండియాలోకి రాకముందు చాలా సిగ్గుపడిపోతుండేవారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. ‘ఓసారి ఇద్దరం నెల రోజులు ఒకే హోటల్ గదిలో ఉన్నాం. తను మాంసాహారి. నేను శాకాహారిని. ఏంకావాలని అడిగితే మీ ఇష్టం అనేవాడు. ఎప్పుడు పడుకుంటావు అని అడిగితే మీకు ఇష్టమైనప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకోండి అనేవాడు. స్వేచ్ఛగా ఉంటాడు కానీ నిర్లక్ష్యం, అహం ఉండదు. జీవితం ఎలా ఉన్నా ఆస్వాదించే మనిషి’ అని కొనియాడారు.
Similar News
News January 27, 2026
ఈ ఎర పంటలతో ఈ ప్రధాన పంటల్లో పురుగుల నియంత్రణ

☛ బత్తాయి పంట చుట్టూ టమాటాను సాగు చేసి పండు రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ☛ పసుపు చుట్టూ ఆముదం పంట నాటి కొమ్మ, కాయ తొలుచు పురుగులను ☛ తీగజాతి కూరగాయల పంటల చుట్టూ మొక్కజొన్నను సాగు చేసి పండు ఈగల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ టమాటా చుట్టూ బంతి/దోసను సాగు చేసి కాయతొలుచు పురుగులు/తెల్లదోమలను.. బంగాళాదుంప పంట చుట్టూ వంకాయ మొక్కలను నాటి అక్షింతల పురుగులను కట్టడి చేయవచ్చు.
News January 27, 2026
రామకృష్ణ తీర్థానికి ఎలా వెళ్లాలంటే..?

రామకృష్ణ తీర్థం కేవలం మాఘ పౌర్ణమి నాడు మాత్రమే భక్తుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. భక్తులు తిరుమల బస్టాండ్ నుంచి బస్సులో పాపవినాశనం చేరుకోవాలి. అక్కడి నుంచి దట్టమైన అడవిలో కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులను 5 AM నుంచి 12 PM వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత వెళ్తే పంపించరు. భక్తులకు మార్గమధ్యలో ఆహారం, నీటిని TTD ఉచితంగా అందిస్తుంది. సాయంత్రం లోపు తిరిగి రావడం తప్పనిసరి.
News January 27, 2026
ఎవరు సాక్షి.. ఎవరు దోషి?

TG: BRS హయాంలో ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈక్రమంలోనే నాటి కీలక నేతలు హరీశ్ రావు, KTRను విచారించిన సిట్ ఇవాళ సంతోష్ రావును ప్రశ్నించనుంది. 2,3 రోజుల్లో కవితను కూడా విచారిస్తుందని సమాచారం. తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఇప్పటికే ఆమె ఆరోపించారు. అయితే ఇప్పటివరకు పిలిచిన నేతలు సాక్షులా? నిందితులా? అసలు ఈ కేసులో దోషులెవరు? అన్నది ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలు.


