News April 8, 2024
పీఎం కాళ్లు పట్టుకుంటారా.. సిగ్గు చేటు నితీశ్: తేజస్వి

ప్రధాని మోదీ కాళ్లను బిహార్ సీఎం నితీశ్ కుమార్ పట్టుకోవడం సిగ్గు చేటు అని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘పీఎం మోదీ కాళ్లను నితీశ్ పట్టుకుంటున్నట్లుగా ఉన్న ఓ ఫొటో ఈరోజు చూశా. చాలా సిగ్గేసింది. నితీశ్ మా రాష్ట్రానికి రక్షకుడు. అంత అనుభవం కలిగిన సీఎం మరొకరు లేరు. ఆయన మోదీ కాళ్లు పట్టాలా?’ అని ప్రశ్నించారు. ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని నితీశ్ ఎన్డీయేలో చేరిన సంగతి తెలిసిందే.
Similar News
News November 9, 2025
చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<
News November 9, 2025
అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.


