News July 19, 2024

అందుకు సిగ్గుపడుతున్నా: బాలీవుడ్ నటుడు

image

పారితోషికం ఎక్కువనే కారణంతోనే దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. నటనపై ఇష్టంతోనే సినీ రంగంలోకి వచ్చిన తనకు ఉత్తరాది సినిమాల్లో పాత్ర భావోద్వేగాలపై పట్టు ఉంటుందన్నారు. కానీ దక్షిణాది పాత్రలపై నియంత్రణ లేదన్నారు. దీంతో డబ్బులు తీసుకొని పాత్రకు న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఈయన ‘సైంధవ్’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

Similar News

News November 18, 2025

ఎనామలీ స్కాన్ ఎందుకంటే?

image

ప్రెగ్నెన్సీలో 20వారాల తర్వాత ఎనామలీ స్కాన్ చేయించాలని వైద్యులు సూచిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(CHD) వంటివి ఇందులో తెలుస్తాయి. అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఈ టెస్ట్ తప్పనిసరి.

గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

image

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.