News February 18, 2025
సిగ్గు సిగ్గు.. సీఎంకు ఇంత అభద్రతా భావమా?: KTR

TG: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన KCR పుట్టినరోజున విద్యార్థులకు స్వీట్లు పంచడం తప్పా అని KTR ప్రశ్నించారు. పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ స్కూల్ HMను సస్పెండ్ చేస్తారా అని ఫైరయ్యారు. వార్డు మెంబర్ కాని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టడం, పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చా అని నిలదీశారు. సిగ్గు సిగ్గు.. CMకు ఇంత అభద్రతా భావమా అని దుయ్యబట్టారు.
Similar News
News November 26, 2025
నేర నిరూపణకు నల్లుల సాయం

నేర పరిశోధనలో నల్లులు కీలకంగా మారే అవకాశం ఉందని మలేషియా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నల్లులు మనుషుల రక్తాన్ని పీల్చిన తర్వాత అందులోని DNAను సుమారు 45 రోజుల వరకు నిల్వ ఉంచగలవని సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా బృందం తెలిపింది. నేరం జరిగిన ప్రాంతాల్లో నల్లులు ఉంటే వీటి నుంచి సమాచారం గుర్తించవచ్చని, సాక్ష్యాలు లేకుండా చేసిన కేసుల్లోనూ ఇవి కీలక ఆధారాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
News November 26, 2025
‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్.. స్పందించిన హీరోయిన్

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.
News November 26, 2025
ఫ్యాన్సీ క్రేజ్.. 8888 నంబర్‌కు భారీ ధర!

కార్ల ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకోసం కొందరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కానీ హరియాణాలో ఓ వ్యక్తి ఏకంగా HR88B8888 నంబర్ ప్లేట్ కోసం ఏకంగా ₹కోటి పైనే వెచ్చించాడు. ఈ నంబర్ కోసం నిర్వహించిన వేలంలో 45 అప్లికేషన్లు వచ్చాయి. బిడ్డింగ్ ధర ₹50 వేలుగా నిర్ణయించగా రికార్డు స్థాయిలో ₹1.17 కోట్లు పలికింది. దేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది.


