News February 10, 2025

షమీ భాయ్.. ఇలా అయితే ఎలా?

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు IND బౌలర్ షమీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్ స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. ENGతో తొలి ODIలో 8 ఓవర్లు వేసి 38/1తో ఫర్వాలేదనిపించినా, రెండో వన్డేలో 7.5 ఓవర్లకే 66 రన్స్ సమర్పించుకున్నారు. అనుకున్న లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోతున్నారు. CTకి బుమ్రా దూరమయ్యే ఛాన్సున్న నేపథ్యంలో షమీ ఫామ్‌లోకి రావడం ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు.

Similar News

News February 10, 2025

అరుదైన సన్నివేశం.. ఫీల్డింగ్ చేసిన కోచ్

image

క్రికెట్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. కివీస్‌తో వన్డే సందర్భంగా SA ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండులో ఫీల్డింగ్ చేశారు. గాయపడిన ఓ ఆటగాడి స్థానంలో ఆయనే బరిలోకి దిగారు. SA20 టోర్నీ సందర్భంగా ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. 13 మందితోనే ఆ జట్టు ట్రైసిరీస్‌ కోసం పాక్‌ పర్యటనకు వచ్చింది. కాగా 2024లో బ్యాటింగ్ కోచ్ డుమినీ కూడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశారు.

News February 10, 2025

‘నమస్కారం’.. వివిధ రాష్ట్రాల్లో ఇలా!

image

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ- నమస్కారం, అరుణాచల్- జైహింద్, అసోం- నొమొస్కార్, బిహార్- ప్రణామ్, గుజరాత్- జై శ్రీకృష్ణ, హరియాణా- రామ్ రామ్, ఝార్ఖండ్ – జోహార్, కర్ణాటక- నమస్కార, కేరళ- నమస్కారం, MP- నమస్తే, MH- నమస్కార్, మణిపుర్ – కురుమ్జరి, మిజోరం – చిబాయ్, నాగాలాండ్ – కుక్నలిమ్, ఒడిశా- నమస్కార్, పంజాబ్ – సత్ శ్రీ అకల్, రాజస్థాన్ – రామ్ రామ్, TN – వనక్కం, యూపీ- రాధే రాధే, వెస్ట్ బెంగాల్ – నమొష్కార్.

News February 10, 2025

UKలో 600 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

image

యూకేలోకి చట్టవ్యతిరేకంగా ప్రవేశించి వివిధ పనులు చేస్తున్న 600మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. వీరంతా అక్రమంగా UKలో ప్రవేశించి రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్, తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. గతేడాది జులై నుంచి జనవరి వరకూ 4వేల మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

error: Content is protected !!