News March 9, 2025
షమీకి గాయం

భారత స్టార్ బౌలర్ షమీకి గాయమైంది. 7వ ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోగా అది షమీ ఎడమ చేతికి తగిలి రక్తం వచ్చింది. చికిత్స అనంతరం షమీ ఓవర్ పూర్తి చేశారు. ఓవర్ ముగిసిన తర్వాత మైదానాన్ని వీడారు. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండటంతో షమీ కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Similar News
News December 27, 2025
నేటి నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) హాల్ టికెట్లు ఇవాళ 11am తర్వాత వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు. అభ్యర్థులు <
News December 27, 2025
MSMEలకు పెరుగుతున్న రుణ వితరణ

దేశంలోని MSMEలకు బ్యాంకులు, NBFCలు తదితరాల నుంచి రుణ వితరణ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్ నాటికి 16% పెరిగి రూ.46లక్షల కోట్లకు చేరింది. యాక్టివ్ లోన్ ఖాతాలూ 11.8% పెరిగి 7.3 కోట్లకు చేరాయి. కేంద్ర రుణ పథకాలతో పాటు విధానపరమైన మద్దతు దీనికి కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లలో MSME రుణ చెల్లింపుల్లో కూడా వృద్ధి కనిపించింది. 91-180 రోజుల ఓవర్ డ్యూ అయిన లోన్లు 1.7% నుంచి 1.4%కి తగ్గాయి.
News December 27, 2025
శనివారం రోజు చేయకూడని పనులివే..

శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనివారం రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం, ఉప్పు, నూనె, ఇనుము, నల్ల మినపప్పు వంటి వస్తువులను కొనడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. మాంసం, మద్యానికి దూరంగా ఉంటూ పేదలను, నిస్సహాయులను వేధించకుండా ఉండాలని సూచిస్తున్నారు. ‘కూతురిని అత్తారింటికి పంపకూడదు. నూనె, నల్ల మినపప్పు దానం చేయాలి. ఫలితంగా శని ప్రభావం తగ్గి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి’ అంటున్నారు.


