News November 30, 2024
షమీకి మళ్లీ గాయం..?

టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా మరోసారి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఓ మ్యాచ్లో బౌలింగ్ వేసే సమయంలో షమీ నడుం నొప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. తమ వైద్యాధికారులు షమీకి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారని BCCI వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడటం అనుమానంగా మారింది.
Similar News
News November 28, 2025
ఎన్నికల వేళ రౌడీషీటర్లపై కన్నేయండి: జిల్లా ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మట్కా, బెట్టింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరు మెరుగుపరచాలని సూచించారు. రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
News November 28, 2025
SU MBA, MCA పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న MBA, MCA విభాగంలో 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 5 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో DEC 9 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
News November 28, 2025
VKB: టీఈ పోల్ యాప్ను వినియోగించుకోండి: కలెక్టర్

టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కావాలసిన సమాచారాన్ని పొందవచ్చునని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ ను పొందవచ్చునని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదును కూడా యాప్ ద్వారా తెలియచేయవచ్చునని తెలిపారు.


