News March 21, 2024

షమీ.. నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నాడు: మాజీ భార్య

image

టీమ్ఇండియా క్రికెటర్ షమీపై మాజీ భార్య హసిన్ జహాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ‘షమీ నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. UP పోలీసుల సహాయంతో అతడు ఈ పథకం రచిస్తున్నాడు’ అని సంచలన కామెంట్స్ చేశారు. కాగా షమీ, జహాన్‌ను 2014లో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018లో కట్నం సహా పలు అంశాలలో షమీ వేధిస్తున్నాడంటూ అతడిపై కేసు పెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

Similar News

News November 25, 2024

ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారం చెల్లించాలన్న కోర్టు!

image

చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీలో పనిచేసే జాంగ్ అనే ఉద్యోగి ఆఫీసులో పడుకున్నాడని యాజమాన్యం అతణ్ని తొలగించింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించారు. అతను 20 ఏళ్లుగా మంచి పనితీరు కనబరిచారని, ముందు రోజు ఆఫీసులో లేట్ అవడంతో పడుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఈక్రమంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు జాంగ్‌కు కంపెనీ 3,50,000 యువాన్‌లు(రూ.40.7 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

News November 25, 2024

UPI నగదు చెల్లింపుల్లో 6.32 లక్షల మోసాలు

image

UPI నగదు చెల్లింపుల్లో 2024-25 FYలో ₹485 Cr విలువైన 6.32 ల‌క్ష‌ల మోసాలు జ‌రిగిన‌ట్టు కేంద్రం తెలిపింది. గ‌త FYలో ₹1,087 కోట్ల విలువైన 13.42 ల‌క్ష‌ల మోసాలు జ‌రిగిన‌ట్టు వెల్ల‌డించింది. మోసాల క‌ట్టడికి ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు కేంద్రం తెలిపింది. యూపీఐ, ఇత‌ర ఆన్‌లైన్ చెల్లింపుల్లో మీకు మోసాలు ఎదురైతే 1930కు ఫోన్ చేయండి, లేదా <>https://www.cybercrime.gov.in<<>>లో రిపోర్ట్ చేయండి. Share It.

News November 25, 2024

APలో తొలి కంటైనర్ ఆస్పత్రి ప్రారంభం

image

ఏజెన్సీల్లో డోలీ మోతలకు చెక్ పెట్టేలా AP ప్రభుత్వం రంగంలోకి దిగింది. మన్యం(D) సాలూరు(మ) కరడవలసలో తొలి కంటైనర్ ఆస్పత్రిని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. గిరిజన, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చామన్నారు. ఆశా కార్యకర్త, బీపీ, షుగర్ సహా 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. చిన్నారులకు టీకాలు, పలు మెడికల్ టెస్టులు చేయించుకునే సౌకర్యం ఇక్కడ ఉందన్నారు.