News February 23, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. తిరిగి వచ్చిన షమీ

image

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత స్టార్ బౌలర్ షమీ మైదానాన్ని వీడి, తిరిగి వచ్చారు. బౌలింగ్ వేస్తున్న సమయంలో కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడ్డారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చారు. మరోవైపు పాకిస్థాన్ 8.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. బాబర్ ఔటయ్యారు.

Similar News

News February 23, 2025

రేపు 3 జిల్లాల్లో సీఎం ప్రచారం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు నిజామాబాద్, మ.1.30 గం.కు మంచిర్యాల, సా.3.30 గంటలకు కరీంనగర్‌లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, సీతక్క, జూపల్లి, కొండా సురేఖ పాల్గొననున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.

News February 23, 2025

గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే మ్యాచ్ చూస్తావా?: వైసీపీ

image

AP: INDvsPAK క్రికెట్ మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లిన మంత్రి <<15555923>>లోకేశ్‌పై<<>> YCP మండిపడింది. ‘ఇటు రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్‌లో మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం. బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది’ అని X వేదికగా విమర్శించింది.

News February 23, 2025

ప్లాస్టిక్ రహిత పెళ్లి

image

TG: ఖమ్మం జిల్లాలో ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకుంది. వెంకటాయపాలెంలో సంపత్, నవ్య ఒక్క ప్లాస్టిక్ వస్తువు లేకుండా పెళ్లి తంతు ముగించారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు అరిటాకులు, మట్టి గ్లాసులు.. ఇలా ప్రతిదీ పర్యావరణహితమైనవే వాడారు. అందరూ ఈ జంటను స్ఫూర్తిగా తీసుకుని ప్లాస్టిక్ భూతాన్ని పక్కనబెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

error: Content is protected !!