News December 5, 2024
‘సయ్యద్ ముస్తాక్ అలీ’లో షమీ సోదరుడి అరంగేట్రం

భారత పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ తరఫున అరంగేట్రం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్లో పేర్కొన్న షమీ, తమ్ముడికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘ఈ స్థాయి టోర్నీలో డెబ్యూ చేయడం ఓ మైలురాయి. నీ పట్ల గర్విస్తున్నా. ప్రయాణాన్ని ఆస్వాదించు. మన కుటుంబమంతా నీవెనుక ఉంది’ అని విష్ చేశారు. కాగా తొలి మ్యాచ్‌లో కైఫ్ 4 ఓవర్లకు 44 రన్స్ ఇచ్చారు. వికెట్లేవీ తీయలేకపోయారు.
Similar News
News March 17, 2026
బొప్పాయిలో గొంగళి పురుగు నివారణ ఎలా?

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.
News March 17, 2026
హనుమాన్ చాలీసా ఎందుకు పఠించాలి?

పూర్వం తులసీదాసు జైలులో బంధీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా రచంచి, పఠించారు. అప్పుడు వేల వానరాలు రాజభవనంపై దాడి చేశాయి. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి అది దైవ సంకల్పమని గ్రహించి, తులసీదాసును విడుదల చేసి క్షమాపణ కోరాడు. కోతులు కూడా శాంతించి అక్కడి నుంచి వెళ్లాయి. తులసీదాసు భక్తి ఆయనను ప్రాణాపాయం నుంచి కాపాడింది. అందుకే మన ఆపదలు తొలగి, ధైర్యం కలగాలంటే రోజూ హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు సూచిస్తారు.
News March 17, 2026
యుద్ధం.. లెబనాన్‌లో 886 మంది మృతి

ఇజ్రాయెల్ చేస్తున్న భీకర వైమానిక దాడుల్లో ఇప్పటిదాకా 886 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 111 మంది చిన్నారులు, 67 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్, US దాడుల్లో ఇరాన్‌లో 1500 మందికి పైగా చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.


