News August 30, 2025
‘పిచ్చి కుక్కలు’ అంటూ షమీ మాజీ భార్య పోస్ట్

తనను భయపెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరిగినా, ఎవరి బెదిరింపులకు భయపడలేదని క్రికెటర్ షమీ <<16902649>>మాజీ భార్య<<>> హసీన్ జహాన్ పోస్ట్ చేశారు. ‘పిచ్చి కుక్కలకు భయపడి ఉంటే 2018లోనే భయపడేదానిని. నన్ను నాశనం చేయాలని చూస్తే తట్టుకొని బలంగా మారుతా’ అని SMలో రాసుకొచ్చారు. ఇటీవల షమీ ఓ ఇంటర్వ్యూలో గతం గురించి వదిలేయాలని, వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జహాన్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
Similar News
News August 30, 2025
కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రియాసీ జిల్లాలోని మహోరే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో ఏడుగురు మరణించారు. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అంతకుముందు రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌తో <<17559722>>ముగ్గురు<<>> మరణించారు.
News August 30, 2025
యూఎస్‌లో ‘OG’ సెన్సేషన్

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘OG’ యూఎస్‌లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ మూవీకి అత్యంత వేగంగా 5 లక్షల డాలర్లకు పైగా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ జరిగినట్లు చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ‘క్షణక్షణమొక తల తెగి పడెలే’ అంటూ టైటిల్ సాంగ్‌లోని లిరిక్‌ను షేర్ చేసింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుండగా ముందు రోజే(SEP 24) యూఎస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
News August 30, 2025
Mood of the Nation: మూడో స్థానంలో CBN

ఇండియా టుడే- సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యంత ఆదరణ పొందిన సీఎంగా UP CM ఆదిత్యనాథ్(36%) తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బెంగాల్ సీఎం మమత(13%), AP సీఎం చంద్రబాబు(7%) ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్(2.1%) ఏడో స్థానంలో ఉన్నారు. బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం(హోమ్ స్టేట్)ల జాబితాలో టాప్-3లో అస్సాం CM హిమంత బిశ్వశర్మ, ఛత్తీస్‌గఢ్ CM విష్ణుదేవ్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఉన్నారు.