News September 22, 2024

రేపు తిరుమలలో శాంతియాగం: చంద్రబాబు

image

AP: జరిగిన తప్పులు క్షమాపణకు శాంతి యాగం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు శాంతి హోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద చేస్తామన్నారు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగంపై సిట్ వేస్తామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

Similar News

News September 22, 2024

బిగ్ బాస్-8: అభయ్ ఎలిమినేట్

image

తెలుగు బిగ్ బాస్-8లో మూడో వారం నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఈ మేరకు హోస్ట్ నాగార్జున అతడిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించారు. ఈ వారం అభయ్ ప్రవర్తనకు హోస్ట్ నాగార్జున రెడ్ కార్డు ప్రకటించారు. నిన్ననే హౌస్ నుంచి బయటకు వెళ్తారని భావించినా అనూహ్య పరిస్థితుల నడుమ ఇవాళ ఎలిమినేట్ అయ్యారు.

News September 22, 2024

మోదీజీ.. ఆ ప్రాంతాల మధ్య వందే భారత్ నడపండి: బిహార్ సీఎం

image

బిహార్‌లోని సీతామఢి జిల్లా నుంచి అయోధ్య వరకు వందే భారత్ రైలు నడపాలని ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ జిల్లాలోని పునౌరా ధామ్ జానకీ మందిర్‌ను స్థానికులు సీతామాత జన్మస్థలంగా భావిస్తారు. ఆ ప్రాంతాన్ని ఆధ్మాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని బిహార్ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యతో కనెక్టివిటీ ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని నితీశ్ ఓ లేఖలో తెలిపారు.

News September 22, 2024

దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఇండియా-ఏ జట్టు

image

దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు సొంతం చేసుకుంది. ఇండియా-బీపై IND-A 132 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టేబుల్‌లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. రుతురాజ్ సారథ్యంలోని ఇండియా-సీ జట్టు 9 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.