News December 17, 2024
విజయసాయిరెడ్డికి DNA టెస్టు నిర్వహించాలి.. లోకేశ్‌కు శాంతి భర్త ఫిర్యాదు

AP: తన భార్యను అడ్డుపెట్టుకుని YCP MP విజయసాయిరెడ్డి విశాఖలో రూ.1,500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ‘VSR నా భార్యతో సహజీవనం చేసి మగబిడ్డను కన్నారు. ఆయనకు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలి. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలి. ఆమెకు అనేక చోట్ల ఉన్న విలువైన ఆస్తులపై విచారణ జరిపించాలి’ అని ఆయన కోరారు.
Similar News
News December 4, 2025
27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం

HYDలో భూమి బంగారమైందంటే ఇదేనేమో. కోకాపేట నియోపొలిస్‌లో ప్రభుత్వం 27 ఎకరాలు విక్రయిస్తే ఏకంగా రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ మూడో విడత వేలంలో ప్లాట్ నంబర్ 19లో ఎకరం రూ.131 కోట్లు, 20లో ఎకరం రూ.118 కోట్లు పలికింది. మొత్తం 8.04 ఎకరాలను వేలం వేయగా HMDAకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రెండు వేలం పాటల్లో రూ.2,700 కోట్లు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికింది.
News December 4, 2025
భారత్ ఓటమికి కారణమిదే..

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ <<18462441>>ఓటమికి<<>> చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే కారణం. మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడు సెంచరీతో చెలరేగాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లకు 82, కుల్దీప్ 10 ఓవర్లకు 78, హర్షిత్ 10 ఓవర్లకు 70 రన్స్ సమర్పించుకోవడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. ఇక ఇలాంటి ఫీల్డింగ్‌తో 400 కొట్టినా కాపాడుకోలేమని క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
News December 4, 2025
సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్‌లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.


