News December 20, 2025

SHAR: 24న ఉదయం 8.54 గంటలకు..

image

AP: మరో శాటిలైట్ ప్రయోగానికి SDSC SHAR సిద్ధమైంది. ఈనెల 24న 8.54amకు LVM3-M6 రాకెట్‌ ప్రయోగాన్ని జరిపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. USకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్‌–6‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ నెల 15న, 21న ప్రయోగం చేయాలనుకున్నా సాంకేతిక కారణాలతో కుదరలేదు. అటు ఈ ప్రయోగాన్ని SHAR గ్యాలరీల నుంచి చూడాలనుకునే వారు <>ఆన్‌లైన్‌<<>>లో నమోదు చేసుకోవాలని ఇస్రో సూచించింది.

Similar News

News December 22, 2025

తప్పు చేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలదే: పొన్నం

image

TG: ఉనికిని కాపాడుకునేందుకే <<18633627>>KCR<<>> నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏమీ లేకుండా చేశారు. తప్పుచేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. గత పాలకుల నిర్వాకంతో కలిగిన ఇబ్బందులను మేము సరిచేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలని కోరుతున్నాం’ అని గాంధీభవన్‌లో చెప్పారు.

News December 22, 2025

స్వయంకృషి: Tutor.. టైమ్, మ్యాటర్ ఉంటే చాలు

image

పిల్లలకు ట్యూషన్ చెబుతూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి రేంజ్ ఆదాయం పొందొచ్చు తెలుసా. కావాల్సింది సబ్జెక్టుపై పట్టు, వివరించగల సామర్థ్యంతో పాటు సమయం. ఆఫ్‌లైన్, ఆన్లైన్లోనూ చెప్పొచ్చు. నగరాల్లో ఇంటికి పిలిపించి మరీ పిల్లలకు ట్యూషన్స్ పెట్టించేందుకు చాలామంది పేరంట్స్ రెడీగా ఉన్నారు. ఏదైనా పని చేస్తూ అదనపు ఆదాయంగా లేదా ఇదే పనిగా ఎంచుకొని ప్లానింగ్‌తో కెరీర్‌గా మార్చుకోవచ్చు.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా

News December 22, 2025

స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లవచ్చా?

image

వంటిల్లును మనం అన్నపూర్ణా దేవి నిలయంగా భావిస్తాం. అందుకే ఇల్లాలు స్నానమాచరించాకే వంట గదిలోకి ప్రవేశించాలని పెద్దలు చెబుతారు. మన శరీర శుద్ధి మనసుపై ప్రభావం చూపుతుంది. శుభ్రంగా ఉండి వండిన ఆహారం అమృతంతో సమానం. అది కుటుంబానికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. స్నానం చేయకుండా వంట చేస్తే ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. అనారోగ్యానికి కారణమవ్వొచ్చు. ఈ నియమాలతో లక్ష్మీ కటాక్షం, ప్రశాంతత చేకూరుతాయని నమ్మకం.