News July 22, 2024
ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ

మహారాష్ట్ర సీఎం, శివసేన లీడర్ ఏక్నాథ్ షిండేతో NCP(SP) చీఫ్ శరద్ పవార్ భేటీ అయ్యారు. ఎన్డీఏ సీఎంతో ఇండియా కూటమికి చెందిన లీడర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 27, 2025
తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<


