News April 10, 2024
కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయండి: లోకేశ్

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ‘జగన్ బాదుడే బాదుడు! ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి’ అని కోరారు.
Similar News
News October 13, 2025
‘ఉల్లి’తో రైతుకు మేలు జరగాలంటే?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. కానీ ఆ ఉల్లిని పండించే రైతుకు కన్నీళ్లు తప్పట్లేదు. కిలో ₹5-10 మాత్రమే పలుకుతుండటంతో అన్నదాతలు వాపోతున్నారు. రేటు పడిపోయినా ఇబ్బంది లేకుండా ఉల్లి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఆనియన్ ఫ్లేక్స్, పొడి, పేస్ట్, నూనె, ఊరగాయలు, చట్నీలు తయారుచేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.
* ప్రతిరోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 13, 2025
హగ్‌కు రూ.3.73 లక్షల ఫీజు.. యువతిపై ట్రోల్స్

చైనాలో ఓ యువతి చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమైన జంట ఎంగేజ్మెంట్ చేసుకుంది. చైనీస్ పద్ధతి ప్రకారం యువతికి యువకుడి ఫ్యామిలీ గిఫ్ట్‌గా ₹25 లక్షలిచ్చింది. ఇంతలో ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసి మనీ తిరిగివ్వడానికి ఒప్పుకుంది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లో తనను హగ్ చేసుకున్నందుకు ₹3.73 లక్షల ఫీజు అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. SMలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
News October 13, 2025
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు విధించిన స్టేను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయమై సీనియర్ లాయర్లతో రేవంత్ భేటీ కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాలపై వారితో చర్చించనున్నారు.