News April 23, 2025
‘వేవ్స్’తో మీ ఆలోచనలు పంచుకోండి: చిరంజీవి

ముంబై వేదికగా మే 1 నుంచి 4 వరకు వరల్డ్ విజువల్ ఎంటర్టైన్మెంట్స్ సమ్మిట్(వేవ్స్)ను కేంద్రం నిర్వహించనుంది. ఇది ప్రతిభను నిరూపించుకునే ఓ వేదిక అని వేవ్స్ బోర్డు సభ్యుడు చిరంజీవి చెప్పారు. ఈ సదస్సు నటుల కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కావొచ్చన్నారు. http://www.wavesindia.org/లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈవెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ప్రొడక్ట్స్ గురించి ఆలోచనలు పంచుకోవాలని కోరారు.
Similar News
News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్గామ్లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.
News April 23, 2025
ఇవాళ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూకశ్మీర్‌లో బంద్‌కు JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్‌లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి.
News April 23, 2025
ట్రెండింగ్: #WeWantRevenge

J&K పహల్గామ్లో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #WeWantRevenge ట్రెండింగ్ చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకుని చంపేయాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి భూమిపై జీవించే హక్కు లేదని పేర్కొంటున్నారు.