News July 15, 2024
దూసుకెళ్లిన హెచ్‌సీఎల్ షేర్లు.. మార్కెట్లు ఎలా ఉన్నాయంటే?

FY25 తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర ఆదాయం పెరగడంతో HCL టెక్ షేర్ల విలువ ఈరోజు ట్రేడింగ్‌లో 4.3% పెరిగింది. ఆరు నెలల్లో 2.2% వృద్ధిని మాత్రమే నమోదు చేసిన ఈ సంస్థ షేర్లు ఇప్పుడు ఈస్థాయిలో పెరగడం పట్ల ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెన్సెక్స్ 80,760 (+241) లాభాలు నమోదు చేయగా నిఫ్టీ తొలిసారిగా 24,600 మార్క్ తాకింది. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ మినహా ఇతర రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News December 22, 2025
Study Curse: మూడేళ్ల కోర్స్ vs మూణ్నెళ్ల కోర్స్

మన క్వాలిఫికేషన్ ఏదైనా అమీర్‌పేటలో 3 నెలలు కోచింగ్‌తో ఆర్నెళ్లలో IT జాబ్ పక్కా. మనం మాట్లాడుకునేది అమీర్‌పేట లేదా కోచింగ్ సెంటర్ల ఘనతపై కాదు. అలా జాబ్ ఇచ్చే కోర్సులు కాలేజ్ సబ్జెక్టులుగా ఎందుకుండవు అనే. బేసిక్స్ చెప్పే స్కూల్, ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ చదివితే జాబ్ వస్తుందా అంటే నో గ్యారంటీ. ట్రెండ్, మార్కెట్ అవసరాలకు తగ్గట్లు అప్డేట్ కాని చదువు మనకు అంటగట్టడం ఎందుకు? ఏమంటారు ఫ్రెండ్స్?
News December 22, 2025
USలో విద్యార్థినులకు పెరిగిన ‘డీప్‌ఫేక్’ బెడద

USలో స్కూళ్లలో డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలతో వేధింపులు ఎక్కువయ్యాయి. విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్చడం ఎంతోకాలంగా జరుగుతున్నా AI సాంకేతికతతో అది మరింత పెరిగింది. లూసియానా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఓ టీచర్‌పైనా అభియోగాలు వచ్చాయి. పిల్లల అసభ్య చిత్రాల కేసుల సంఖ్య 2023లో 4,700 కాగా 2025 మొదటి 6 నెలల్లోనే 440,000కి పెరిగినట్లు NCMEC నివేదిక పేర్కొంది.
News December 22, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


