News March 13, 2025
చేతిలో రూ.12 లక్షల విలువైన షేర్లు.. కానీ!

రతన్ అనే వ్యక్తికి 1992లో తన తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న <<15725743>>షేర్స్<<>> అగ్రిమెంట్ పేపర్స్ దొరికిన విషయం తెలిసిందే. వీటి విలువ దాదాపు రూ.12లక్షలు అయినప్పటికీ షేర్స్‌ను డిజిటలైజ్ చేసేందుకు ఆయన ఇష్టపడట్లేదు. ‘డిజిటలైజ్ చేసేందుకు మూడేళ్లు పట్టేలా ఉంది. కేవలం వారసుడిగా సర్టిఫికెట్ పొందేందుకే 8నెలలు పడుతుంది. ఇంత సమయాన్ని దీనికోసం వృథా చేయను. ఇండియాలో ఈ ప్రక్రియ వ్యవధిని తగ్గించాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
అసెంబ్లీ: బీఆర్ఎస్‌ఎల్పీలో ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. తనపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్‌ఎల్పీలోని కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అయితే ఆయన వద్దకు వెళ్లిన మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. దీంతో జగదీశ్, కేటీఆర్, హరీశ్, తలసాని వారితో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
News March 13, 2025
2లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

AP: ఏఐ, డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏటా 2లక్షలమందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో APSSD ఒప్పందం చేసుకొంది. 50 ఇంజినీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ, 10వేల మంది విద్యార్థులకు ఏఐ , క్లౌడ్ కంప్యూటరింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వనుంది. అదే విధంగా 30 ఐటీఐల్లో 30వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
News March 13, 2025
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.