News July 23, 2024
వర్క్ ప్లేస్‌లో రహస్యాలు పంచుకుంటున్నారా?

ఉద్యోగం చేసే చోట పలు విషయాలు రహస్యంగా ఉంచాలని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక అంశాలు, రాజకీయ, మతపరమైన అభిప్రాయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటివి తోటి ఉద్యోగులతో షేర్ చేసుకోవద్దని అంటున్నారు. పంచుకుంటే అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పనిచేసే చోట ఏమైనా సమస్యలు ఎదురైతే సరైన వారితో పంచుకోవాలని చెబుతున్నారు.
Similar News
News November 1, 2025
GNSS కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

GNSS స్పెషల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన నీలమయ్య రిలీవ్ అయ్యాడు. ఆ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌ను అదనంగా స్పెషల్ కలెక్టర్‌గా కేటాయించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్లో కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు.
News November 1, 2025
వర్షం పడదంటున్నా ₹34 కోట్లతో క్లౌడ్ సీడింగ్

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ విఫలమవడం తెలిసిందే. కాన్పూర్ IITతో కలిసి మేఘమథనం చేసినా వాన పడలేదు. అయితే ఢిల్లీ వాతావరణం క్లౌడ్ సీడింగ్‌కు అనుకూలమైనది కాదని CAQM, CPCB, IMD నిర్ధారించాయని 2024లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది. అయినా ఢిల్లీ ప్రభుత్వం ₹34 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి ఇప్పటికే ₹3కోట్ల వెచ్చించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగంపై పలువురు మండిపడుతున్నారు.
News November 1, 2025
మీ కొడుకుని సూపర్ హీరోగా పెంచండి!

ప్రస్తుత టెక్‌యుగంలో పిల్లలు మంచి కన్నా చెడుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే వారికి చిన్నప్పటి నుంచే మంచి విషయాలపై అవగాహన కల్పించాలి. తోటివారిని గౌరవించడం, ఇతరుల వద్దకు వెళ్తే అనుమతి అడగడం, ఓర్పుతో ఉండటం, నిజాయతీగా మెలగడం వంటివి నేర్పాలని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల పట్ల గౌరవం, సహానుభూతి చూపడం మంచి లక్షణాలని చెప్పండి. న్యాయం కోసం నిలబడే గుణాలను నేర్పిస్తే ఆదర్శవంతుడిగా ఎదుగుతాడు.


