News August 18, 2024
మీ ట్రిప్ విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

TG: సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలా వివరాల్ని బయటపెట్టడం సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. ఏదైనా ట్రిప్కు వెళ్తే ఆ వివరాల్ని షేర్ చేయొద్దని చెబుతున్నారు. ఒకవేళ షేర్ చేస్తే నేరగాళ్లు రహస్యంగా కదలికల్ని గమనిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ఛాన్సుందని, ఆ తర్వాత వేధింపులకు గురిచేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News September 18, 2025
జగిత్యాల: ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సాధన కోసం కృషి

JGTLలో ఎస్టీయూ, TS జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అర్హులైన ఉపాధ్యాయులకు MEO, Dy EO, డైట్, జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. PRC నివేదిక బహిర్గతం ఆలస్యం సరికాదని విమర్శించారు. ఎస్టీయూ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
News September 18, 2025
జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.
News September 18, 2025
నేను అన్ని మతాలను విశ్వసిస్తా: CJI గవాయ్

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై CJI గవాయ్ స్పందించారు. ‘నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని SMలో తప్పుగా చూపించారు’ అని అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను ఇటీవల SC తిరస్కరించింది. ఈ సందర్భంగా ‘ASIని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.