News December 4, 2024
చుట్టూ సొరచేపలు.. అత్యంత ప్రమాదకరమైన హోటల్!

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన హోటల్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఈ ఫ్రైయింగ్ పాన్ హోటల్ నార్త్ కరోలినా తీరానికి 32 మైళ్ల దూరంలో ఉంది. చుట్టూ ఉండే నీటిలో సొరచేపలుంటాయి. సముద్ర మట్టానికి 135 అడుగుల ఎత్తులో నాలుగు స్థంబాల సపోర్ట్‌తో దీనిని నిర్మించారు. ఇక్కడి చేరుకునేందుకు హెలికాప్టర్ లేదా బోట్ అందుబాటులో ఉంటాయి. ఇది ఒక లైట్‌హౌస్ ప్లాట్‌ఫామ్ కాగా, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.
Similar News
News January 1, 2026
ఎల్లుండే టీమ్ ప్రకటన.. షమీ రీఎంట్రీ?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఈ నెల 3న BCCI ఎంపిక చేయనుంది. ఇటీవల సౌతాఫ్రికాతో మ్యాచులకు దూరమైన గిల్ తిరిగి టీమ్‌లోకి రానున్నారు. సీనియర్ ప్లేయర్లు హార్దిక్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ ఈ సిరీసూ ఆడబోరని సమాచారం. ఎన్నాళ్ల నుంచో కమ్‌బ్యాక్ కోసం చూస్తున్న షమీ రీఎంట్రీ ఇవ్వొచ్చు. సర్ఫరాజ్కూ చోటు దక్కే ఛాన్స్ ఉంది. JAN 11న తొలి వన్డే జరగనుంది.
News January 1, 2026
డ్రంకెన్ డ్రైవ్.. రీడింగ్ చూస్తే షాకే!

TG: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబు రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిన్న రాత్రి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా ఏకంగా 438 రీడింగ్ నమోదైంది. న్యూఇయర్ వేళ డ్రంకెన్ డ్రైవ్‌లో నమోదైన రీడింగ్‌ల్లో ఇదే అత్యధికమని ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
News January 1, 2026
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవా

TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో 15 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా గతంలో పనిచేశారు.


