News April 6, 2024
షర్మిలను అందుకే పక్కన పెట్టారు: సునీత

AP: షర్మిలకు ఆదరణ వస్తోందని YCP పక్కనపెట్టినట్లు వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీని భుజాలపై వేసుకొని నడిపించారని అన్నారు. అప్పట్లో ఉపఎన్నికల్లో పోటీ చేసిన వారిని షర్మిల దగ్గరుండి గెలిపించారని గుర్తు చేశారు. ఆమెకు ఆదరణ పెరగడంతో 2014 ఎన్నికల్లో విశాఖకు పంపాలని నిర్ణయించారన్నారు. పులివెందులలో అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓటమిపాలయ్యారని ఆరోపించారు.
Similar News
News January 27, 2026
‘CM’ అంటే కోల్ మాఫియా: KTR

TG: ఆధారాలతో సహా సింగరేణి కుంభకోణాన్ని బట్టబయలు చేశామని KTR పేర్కొన్నారు. ‘గవర్నర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చాం. సింగరేణి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి విచారణ పేరిట ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఇవాళ CM అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి ఉంది. టెండర్లకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే సమాధానం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News January 27, 2026
పుస్తకాలే లోకమైన అక్షర తపస్వికి దక్కిన గౌరవం!

పుస్తకాలపై మక్కువతో తన ఆస్తినే అమ్ముకున్న కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బస్ కండక్టర్గా పనిచేస్తూనే 20 లక్షల పుస్తకాలతో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో 5 లక్షల విదేశీ పుస్తకాలు, 5 వేల నిఘంటువులు ఉన్నాయి. ఒక సామాన్యుడి పట్టుదల ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని పొందేలా చేసింది. ఆయన కృషి నేటి తరానికి ఎంతో స్ఫూర్తి.
News January 27, 2026
సీరియల్ నటి భర్తపై కత్తితో దాడి!

కన్నడ సీరియల్ నటి కావ్య గౌడ భర్త సోమశేఖర్ కత్తి గాయాలతో ఆస్పత్రిలో చేరారు. తమ కుటుంబసభ్యులే ఈ దాడికి పాల్పడినట్లు నటి ఆరోపించారు. కావ్య గౌడ సోదరి భవ్య గౌడ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో సోమశేఖర్పై సోదరుడు, బంధువులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ‘అక్కమొగుడు’ సీరియల్తో ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.


