News February 1, 2025
కొండంత రాగం తీసి కూసంత పాట: షర్మిల

AP: బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 12మంది MPలు ఉన్న నితీశ్‌కు బడ్జెట్లో అగ్రతాంబూలం అందుకుంటే, 21మంది MPలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకు చిప్ప చేతిలో పెట్టారన్నారు. ప్రత్యేకహోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత అన్యాయం జరిగితే CM బడ్జెట్‌ను స్వాగతించడం హాస్యాస్పదమన్నారు.
Similar News
News November 11, 2025
తానికాయ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

త్రిఫలాలలో(ఉసిరి, తాని, కరక్కాయ) ఒకటైన తానికాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తానికాయ పొడిలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, ఆస్తమా సమస్యలు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు. విరేచనాలు, చిన్న పేగుల వాపు తగ్గి.. జీర్ణ, శ్వాస, మూత్రాశయ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఈ పొడిలో చక్కెర కలిపి తింటే కంటిచూపు మెరుగవుతుందని చెబుతున్నారు.
News November 11, 2025
పాపం.. ప్రశాంత్ కిశోర్

దేశంలోని అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలు సొంత రాష్ట్రంలో తన పార్టీకి మాత్రం ఉపయోగపడలేదు. ‘జన్ సురాజ్’ ద్వారా బిహార్ గతిని మారుస్తానంటూ చేసిన ఆయన ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇవాళ వెలువడిన అనేక ఎగ్జిట్ పోల్స్.. PK పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని తేల్చాయి. అనేక పార్టీలకు అధికారం తెచ్చానన్న ఆయన మాత్రం గెలుపు దరిదాపుల్లోకీ రాలేకపోయారు.
News November 11, 2025
ONGC గ్యాస్‌ను రిలయన్స్ దొంగిలించిందా?

ముకేశ్ అంబానీపై కోర్టులో <<18259833>>పిటిషన్<<>> నేపథ్యంలో ONGC గ్యాస్‌ను RIL దొంగిలించిందా? అన్నది చర్చగా మారింది. APలోని KG బేసిన్లో 2004-14 మధ్య తన బావుల లోపల నుంచి RIL పక్కకు తవ్వి అదే బేసిన్‌లోని ONGC బావుల గ్యాస్($1.55B)ను తీసుకుందని అప్పట్లో అధికారులు కేంద్రానికి తెలిపారు. DM, AP షా కమిటీలూ దీన్ని నిర్ధారించాయి. ఆపై RIL తనకు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డు తెచ్చుకోగా ఢిల్లీ హైకోర్టు దాన్ని పక్కన పెట్టింది.


