News April 20, 2024
జగన్ వద్ద ₹82 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల

AP: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ఆస్తుల విలువ రూ.182.82 కోట్లుగా ప్రకటించారు. అందులో చరాస్తులు రూ.123.26 కోట్లు, స్థిరాస్తులు రూ.9.29 కోట్లుగా ఉన్నాయి. షర్మిల వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారు, రూ.4.61 కోట్ల విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నాయి. ఇక అన్న జగన్ వద్ద రూ.82.58 కోట్లు, వదిన వైఎస్ భారతిరెడ్డి వద్ద రూ.19.56 లక్షలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. షర్మిలపై 8 కేసులు ఉన్నాయి.
Similar News
News February 4, 2026
కల్కి పార్ట్-2లో 90 నిమిషాల పాటు కమల్!

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
News February 4, 2026
రైతులకు గుడ్‌న్యూస్.. విపత్తుల టైమ్‌లో డాక్యుమెంట్స్ లేకుండా లోన్?

వరదల వంటి విపత్తుల టైంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని RBI సూచించింది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం.. ‘బాధిత రైతులకు EMIల రీ-షెడ్యూలింగ్, మారటోరియం, డాక్యుమెంట్స్ లేకుండా టాపప్ లోన్ల వంటి సదుపాయాలు కల్పించాలి. ఎక్స్‌ట్రా ఛార్జీలు ఏడాది వరకు రద్దు చేయాలి. విపత్తుకు ముందు 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయి ఉండొద్దు’ పేర్కొంది. వీటికి ఆమోదం లభిస్తే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
News February 4, 2026
దేశీ మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.41,200

TG: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి రికార్డు ధర పలికింది. క్వింటా మిర్చి రూ.41,200కు అమ్ముడుపోయింది. గత మూడేళ్లలో దేశీ మిర్చికి ఇదే రికార్డు ధర అని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.


