News October 29, 2024

జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల ఎంతో కృషి చేసింది: విజయమ్మ

image

AP: రాజకీయాల్లో జగన్ చెప్పినట్లే షర్మిల చేసిందని వైఎస్ విజయమ్మ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ‘జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. ఆయన అధికారంలోకి రావడానికి పాప ఎంతో కృషి చేసింది’ అని ఆమె రాసుకొచ్చారు. అన్నీ YS కుటుంబ ఆస్తులేనని, వాటిని పంచుదాం అనుకునేలోపే YSR ప్రమాదంలో చనిపోయారని వెల్లడించారు. ఏదేమైనా జగన్, షర్మిల అన్నాచెల్లెళ్లని, ఏ సమస్య వచ్చినా ఇద్దరే పరిష్కరించుకుంటారని విజయమ్మ అన్నారు.

Similar News

News January 20, 2026

మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

image

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News January 20, 2026

నా సినిమా 23 ఆత్మహత్యలను ఆపింది: అంకిత్ సఖియా

image

తాను తెరకెక్కించిన ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ సినిమాకు ఎంతో మంది కనెక్ట్ అయ్యారని డైరెక్టర్ అంకిత్ సఖియా చెప్పారు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న 23 మంది ఈ సినిమా చూశాక తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని దేశం మొత్తం చూపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా రూ.50 లక్షలతో తెరకెక్కిన ఈ గుజరాతీ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

News January 20, 2026

LRS.. ఇలా అప్లై చేసుకోండి

image

AP: 2025 జూన్ 30లోపు రిజిస్టర్ అయిన <<18903924>>ప్లాట్లు<<>> లేదా లే అవుట్లు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయం లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. lrsdtcp.ap.gov.inలోకి వెళ్లి సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, ప్లాట్ ప్లాన్, ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజులో రూ.10వేలకు తగ్గకుండా ప్రాథమికంగా చెల్లించాలి. ఆ తర్వాత రాయితీ ఇస్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు.