News April 5, 2024
ఇవాళ్టి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
AP: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా PCC చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్‌లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, ఆట్లూరులో యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్సుంది.
Similar News
News January 6, 2025
హీరో విశాల్ ఆరోగ్యంపై అపోలో డాక్టర్ల అప్డేట్
<<15074772>>హీరో విశాల్<<>> ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ‘ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాం. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఓ లెటర్ రిలీజ్ చేశారు. కాగా ‘మదగజరాజ’ ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
News January 6, 2025
కుంభమేళాపై దాడి చేస్తాం: గురుపత్వంత్ పన్నూ
Jan 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే కుంభమేళాపై దాడి చేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. హిందూత్వ సిద్ధాంతాల్ని అంతం చేయడానికి తరలిరావాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయాల్లో ఖలిస్థానీ, కశ్మీర్ జెండాలను ఎగరేయాలని, కుంభమేళా-2025 యుద్ధభూమిగా మారుతుందని చెప్పుకొచ్చాడు. పన్నూ గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు చేశాడు.
News January 6, 2025
ఘోరం.. పిల్లలకు విషమిచ్చి పేరెంట్స్ ఆత్మహత్య
బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అతని భార్య తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనూప్ కుమార్(38), రాఖీ(35), అనుప్రియ(5), ప్రియాంశ్(2)గా గుర్తించారు. వీరి స్వస్థలం యూపీలోని ప్రయాగ్ రాజ్ అని పోలీసులు తెలిపారు. తీవ్ర ఆర్థిక సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.