News October 28, 2024
జగన్‌పై షర్మిల భర్త హాట్ కామెంట్స్
AP: జగన్‌కు మద్దతుగా పాదయాత్ర చేయాలని షర్మిలను భారతీనే అడిగారని ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘యాత్ర సందర్భంగా ఆమె పార్టీని ఎత్తుకుపోతోందని జగన్‌తో సజ్జల చెప్పారు. జగన్‌కు అప్పటి నుంచే అభద్రతాభావం మొదలైంది. మధ్యలో చాలామంది చిచ్చులు పెట్టారు. TGలో పార్టీ పెట్టాలని షర్మిలను PK అడిగారు. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయని, KCRతో ఇబ్బంది అవుతుందని జగన్ వద్దన్నారు’ అని అనిల్ చెప్పారు.
Similar News
News October 29, 2024
వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు: పవన్ కళ్యాణ్
AP: భూమ్మీద జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదులకు మనలాగే బతికే హక్కు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. వాటి సంరక్షణ కోసం యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. వన్య ప్రాణులను వేటాడటాన్ని అరికట్టేందుకు 18004255909 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
News October 29, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: అక్టోబర్ 29, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:13 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 29, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.