News April 20, 2024
నామినేషన్‌కు ముందు షర్మిల ఆసక్తికర ట్వీట్

AP: కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేసే ముందు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సమయంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన వారి శుభాకాంక్షలు అందుకుని విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. నాన్న, బాబాయ్‌ని మరిచిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2026
కరెంట్ అఫైర్స్

* ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్, మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్‌ను చేర్చాలని UNESCOకు ప్రతిపాదన.
* భారత్-సీషెల్స్ మధ్య ‘ఎక్సర్‌సైజ్ లామిటియే’ 11వ ఎడిషన్ పూర్తి. లామిటియే అంటే స్నేహం.
* వరల్డ్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్-సింగపూర్ ఛాంగి ఎయిర్‌పోర్ట్. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు 28వ స్థానం.
* జలంధర్‌లోని ఆదంపుర్ విమానాశ్రయానికి ‘శ్రీగురు రవిదాస్ మహారాజ్ ఎయిర్‌పోర్టు’గా పేరు మార్పు. SHARE IT
News March 24, 2026
IPL కోసం BCCI కఠినమైన రూల్స్!

IPL 2026 కోసం BCCI కఠినమైన కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసినట్లు సమాచారం. ఇకపై ప్లేయర్లు తమ ఫ్యామిలీతో కాకుండా కేవలం టీమ్ బస్సులోనే ప్రయాణించాలని కండిషన్ పెట్టినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్ సెషన్లపై నిషేధం విధించింది. డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఫ్యామిలీ ఎంట్రీని నిలిపివేసింది. పిచ్‌లను కాపాడటం, బ్రాడ్‌కాస్టింగ్ క్వాలిటీని పెంచడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
News March 24, 2026
పాక్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు?

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ వేదిక కాబోతున్నట్లు సమాచారం. ఇస్లామాబాద్‌లో ఈ వారమే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ వెల్లడించింది. US తరఫున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండగా పాక్‌తో పాటు తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తులుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.


