News July 17, 2024

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై షర్మిల ప్రశ్నలు

image

AP: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై APCC చీఫ్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ‘NDAలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారు? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి BJP పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారు? గెలిచిన రోజు నుంచి 4 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా?’ అని ఆమె నిలదీశారు.

Similar News

News December 6, 2025

BECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్‌సైట్: https://www.becil.com

News December 6, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

image

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.

News December 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 88

image

ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>