News April 24, 2024
శశిథరూర్ ఒక ఆశను కల్పించారు: ప్రకాశ్ రాజ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురం నుంచి మళ్లీ గెలుస్తారని నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. ‘థరూర్ ఈ నియోజకవర్గానికి చాలా చేశారు. మళ్లీ ఆయనే గెలుస్తారు. ఆయన నాకు మిత్రుడని నేను మద్దతు ఇవ్వడం లేదు. గడచిన దశాబ్ద కాలంగా ఈ దేశ ప్రతినిధిగా థరూర్ నమ్మకాన్ని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. తిరువనంతపురంలో థరూర్ 2009 నుంచి గెలుస్తుండటం గమనార్హం.
Similar News
News March 5, 2026
తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయ్..

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. <
Share It
News March 5, 2026
మిడిల్ ఈస్ట్‌లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్‌తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.
News March 5, 2026
‘నేను ఇంటికి వెళ్లాలి’.. వెస్టిండీస్ కోచ్ ఆవేదన!

T20 WC నుంచి వెస్టిండీస్ నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉండిపోయారు. ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గగనతల ఆంక్షలతో వారు వెళ్లేందుకు వీలు కాలేదు. ఈ క్రమంలో తనకు ఇంటికి వెళ్లాలని ఉందంటూ వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కనీసం అప్డేట్ ఇవ్వండి. ఎప్పుడు వెళ్తామో చెప్పండి. ఈ రోజా? రేపా? వచ్చే వారమా? ఇప్పటికే 5 రోజులు అవుతోంది’ అని ట్వీట్ చేశారు.


