News July 1, 2024

ఆసుపత్రిలో చేరిన శతృఘ్న సిన్హా

image

బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా వైరల్ ఫీవర్‌తో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఇవాళ డిశ్చార్జ్ అవుతారని సమాచారం. పని ఒత్తిడితో ఆయన అనారోగ్యానికి గురవ్వగా కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవలె శత్రుఘ్న కూతురు సోనాక్షి ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కార్యక్రమాలతో జూన్ నెలంతా ఆయన బిజీబిజీగా గడిపారు.

Similar News

News April 11, 2026

మహబూబ్‌నగర్: విద్యతోనే మహిళా సాధికారత: కలెక్టర్‌

image

సమాజంలో మహిళలు విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కలెక్టర్‌ కుష్బూ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు ఫూలే చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో మేయర్‌ మమత, డి.మేయర్‌ సురేందర్‌, ముడా ఛైర్మన్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

News April 11, 2026

చర్మంపై నల్లటి మచ్చలా.. ఇలా చేయండి!

image

సూర్యరశ్మి, కాలుష్యం, హార్మోన్ల మార్పుల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు (పిగ్మెంటేషన్) ఏర్పడతాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. సన్‌స్క్రీన్ వాడకం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని సూచిస్తున్నారు. కాలుష్యం వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ చర్మాన్ని దెబ్బతీస్తుందని, సరైన పోషణతో దీనిని నివారించవచ్చని పేర్కొంటున్నారు. హెల్తీ లైఫ్‌స్టైల్ చర్మ సౌందర్యానికి కీలకమంటున్నారు.

News April 11, 2026

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <>ఎగ్జామ్స్<<>> జరుగుతాయని పేర్కొంది. కాగా ఫిబ్రవరి 23నే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, NCBలో మొత్తం 25,487 ఉద్యోగాలు ఉన్నాయి.
Share It