News June 2, 2024

మోదీ PM అయితే గుండు కొట్టించుకుంటా: AAP ఎమ్మెల్యే

image

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ సవాల్ చేశారు. ఆయన న్యూ ఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ జూన్ 4న తప్పు అని తేలుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News December 5, 2025

డబ్బులు రీఫండ్ చేస్తాం: IndiGo

image

విమాన సర్వీసుల రద్దుపై ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య టికెట్ బుక్ చేసుకొని, రద్దు లేదా రీషెడ్యూల్ చేసుకున్నవారికి ఫుల్ రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. ఎయిర్‌పోర్టుల్లో ఉన్నవారందరినీ సేఫ్‌గా చూసుకుంటామని, ఇబ్బందిపడుతున్న వారికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. వేల సంఖ్యలో హోటల్ గదులు, రవాణా, ఫుడ్, స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

News December 5, 2025

అఖండ-2 వాయిదా.. బాలయ్య తీవ్ర ఆగ్రహం?

image

అఖండ-2 సినిమా రిలీజ్‌ను <<18473406>>వాయిదా<<>> వేయడంపై బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఫైనాన్స్ ఇబ్బందులను దాచడంపై నిర్మాతలతోపాటు డైరెక్టర్ బోయపాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభిమానులతో ఆటలు వద్దని, సాయంత్రంలోపు విడుదల కావాల్సిందేనని పట్టుబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్పటికప్పుడు బడా ప్రొడ్యూసర్లు 14 రీల్స్ నిర్మాతలకు కొంత సాయం చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News December 5, 2025

మోదీ-పుతిన్ మధ్య స్పెషల్ మొక్క.. ఎందుకో తెలుసా?

image

హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పాల్గొనగా.. వీరి మధ్య ఉంచిన ఓ మొక్క అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మొక్క పేరు హెలికోనియా. ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు దీనిని ఉంచడం శుభ సూచకంగా భావిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి & అభివృద్ధికి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.