News July 26, 2024
ఆమెకు 115.. కూతురికి 95 ఏళ్లు

USలో ఓల్డెస్ట్ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ 115 ఏట అడుగుపెట్టారు. ఈమె 1909లో లూసియానాలో జన్మించారు. 11ఏళ్లకే తల్లి చనిపోవడంతో ఎన్నో కష్టాలు అనుభవించారు. టీనేజ్‌లో కాఫీ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. తన జీవితకాలంలో 20 మంది US అధ్యక్షులను, మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా-ఉక్రెయిన్ వార్ వరకు ఎన్నో ఉదంతాలను వీక్షించారు. ప్రస్తుతం తన 95 ఏళ్ల కూతురు డోరతీ విలియమ్స్‌తో కలిసి జీవిస్తున్నారు.
Similar News
News April 2, 2026
హనుమాన్: భక్తుడే కాదు.. గొప్ప రక్షకుడు కూడా!

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.
News April 2, 2026
హనుమంతుడికి 5 ముఖాలు ఎలా వచ్చాయి?

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం జపించి, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
News April 2, 2026
ఆంజనేయుడే కాదు.. ఆయన తోక కూడా అంతే శక్తిమంతమైనది..

నారద పురాణం ప్రకారం.. ఆజన్మ బ్రహ్మచారి హనుమాన్ లాంగూలం(తోక) సాక్షాత్తు రుద్రుడి రూపమని చెబుతారు. అందుకే ఆయన తోకను కూడా పూజిస్తే కష్టాలు కానరాకుండా పోతాయని నమ్ముతారు. ‘పూర్వం, భీముడు కూడా ఆయన తోకను కదపలేకపోయాడు. తులసీదాస్ ‘హనుమాన్ బాహుక్’ స్తోత్రంతో హనుమ లాంగూల స్పర్శను కోరి తన బాధలను పోగొట్టుకున్నారు. లాంగూల స్తోత్ర పఠనం రోగాలు, కష్టాలను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది’ అని పండితులు చెబుతారు.


