News February 23, 2025
మైనర్ బాలికే.. కానీ ఆమెకు అన్నీ తెలుసు: బాంబే హైకోర్టు

మైనర్ బాలికే అయినా ఓ వ్యక్తితో గడిపితే ఎదురయ్యే పర్యవసానాలు అన్నీ ఆమెకు తెలుసని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, ఓ యువకుడితో మూడు రాత్రిళ్లు పరస్పర ఇష్టంతో గడిపింది. కానీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం పరస్పరం ఇష్టంతో గడిపినందుకే అతడికి బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది.
Similar News
News February 23, 2025
INDvsPAK: దుబాయ్‌లో బుమ్రా సందడి

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత స్టార్ బౌలర్ బుమ్రా దుబాయ్ స్టేడియానికి వచ్చారు. ఐసీసీ టీ20, టెస్ట్ టీమ్ క్యాపులు, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డులు అందుకున్నారు. అనంతరం టీమ్ ఇండియా ప్లేయర్లతో కాసేపు ముచ్చటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాల్సిన ఆయన గాయం కారణంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.
News February 23, 2025
అతడి వద్ద అమ్మాయిల నగ్న వీడియోలు, వేల ఫొటోలు

TG: యువతుల ప్రైవేటు వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయి కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి హార్డ్ డిస్క్‌లో 499 వీడియోలు, వేలకొద్దీ ఫొటోలు, ఆడియో కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువతులు వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసినవి, లావణ్యతో పాటు ఆమె ఫ్రెండ్స్‌ను లోబర్చుకున్నప్పుడు తీసిన వీడియోలు అందులో ఉన్నాయి. మూడేళ్లుగా అతడు వీటిని సేవ్ చేసుకున్నట్లు తేల్చారు.
News February 23, 2025
ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న ముద్ర చెరగనిది: లోకేశ్

AP: కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా మంత్రి లోకేశ్ నివాళులు అర్పించారు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోని ప్రజా నాయకుడు ఎర్రన్నాయుడు. ప్రజా సమస్యలపై ఆయన స్పందించే విధానం, అనేక క్లిష్టమైన సమస్యలపై పోరాటం నేటి తరానికి ఆదర్శనీయం. రాష్ట్రానికి, తనని నమ్ముకున్న ప్రజలకి న్యాయం చెయ్యాలనే బలమైన సంకల్పం ఉంటే భాష అసలు సమస్యే కాదంటూ ఢిల్లీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు’ అని కొనియాడారు.